జిల్లా విద్యాధికారి పై కలెక్టర్ ఆగ్రహం

by velandi.Saikiran |

ప్రభుత్వం నియమించిన చోట కాకుండా ఉపాధ్యాయుల‌ను ఎందుకు డిప్యూటేషన్ పై పంపించారని డిఈఓ బిక్షపతి పై జిల్లా కలెక్టర్ ఇలా

జిల్లా విద్యాధికారి పై కలెక్టర్ ఆగ్రహం
X

దిశ, మర్రిగూడ (నాంపల్లి) : ప్రభుత్వం నియమించిన చోట కాకుండా ఉపాధ్యాయుల‌ను ఎందుకు డిప్యూటేషన్ పై పంపించారని డిఈఓ బిక్షపతి పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి మండలం నరసింహుల గూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి రోహిణిని అనారోగ్యం పేరుతో అక్రమంగా ఓడిపై మునుగోడు మండలంలోని పులి పలుపులల పాఠశాలకు విద్యాశాఖ అధికారి డిప్యూటేషన్ వేశారు.

పాఠశాలకు ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులలో ఒకరిని డిప్యూటేషన్ వేయడం వలన ఒకరితో ఇబ్బందిగా ఉందని సోమవారం విద్యార్థినిలు, గ్రామస్తులు ఆంజనేయులు, గణేష్, శంకర్, బిక్షం ,రాజు ,నగేష్ ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్... డీఈఓ ను పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటేషన్ రద్దుచేసి నారసింహుల గూడెం పాఠశాల కు ప్రధానోపాధ్యాయురాలు రోహిణిని నరసింహుల గూడెం పాఠశాలకు పంపియాలని కలెక్టర్... డి ఓ ను ఆదేశించారు.

Next Story