మొదటి దశ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

by Bhanu |

నల్గొండ జిల్లాలో రెండు డివిజన్లలోని 14 మండలాలలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదినికి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందని, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించామని, పోలింగ్ సిబ్బంది, పార్కింగ్, సిబ్బందికి భోజనం, వసతి సౌకర్యాలు అన్నిటిని ఏర్పాటు చేశామన్నారు.

మొదటి దశ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్: నల్గొండ జిల్లాలో రెండు డివిజన్లలోని 14 మండలాలలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదినికి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందని, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించామని, పోలింగ్ సిబ్బంది, పార్కింగ్, సిబ్బందికి భోజనం, వసతి సౌకర్యాలు అన్నిటిని ఏర్పాటు చేశామన్నారు. సూక్ష్మ పరిశీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఎన్నికలను సవ్యంగా నిర్వహించేలా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మంగళవారం రాష్ట్రా ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, గ్రామపంచాయతీ ఎన్నికల పరిశీలకులతో గ్రామపంచాయతీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ.. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని మాట్లాడుతూ.. పోలింగ్ రోజున 9, 11,1 గంటకు పంపించే పోలింగ్ శాతాన్ని సరైన సమయంలో పంపించేందుకు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని.. ఫలితాలను ఎప్పటికప్పుడు టీ పోల్ లో ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని మాట్లాడుతూ.. మొదటి విడత ఎన్నికల సందర్భంగా కలెక్టర్లు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు మరోసారి సమీక్షించుకోవాలని, ఇందుకు అవసరమైన టీమ్స్, వారికి అందజేసే ఫారాలు, వెబ్ కాస్టింగ్, ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇచ్చే పోలింగ్ శాతం, పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల ప్రచారం ముగింపు, మద్యంపై నిషేధం, ఓటర్లు ఓటు వేసేందుకు 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒక దాన్ని చూపించే విషయం అన్నింటిపై సమీక్షించారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు టి పోల్ లో ఉంచాలన్నారు. స్థానిక సంస్థల ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జై శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జడ్పి సీఈఓ శ్రీనివాసరావు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

Next Story