దత్తత‌ విద్యార్థికి ఇంటి పట్టా అందజేసిన క‌లెక్ట‌ర్

by Ratna Kumari |

దత్త విద్యార్థి భరత్ చంద్ర కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తూ ఇంటి పట్టాను యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు మంగళవారం అందజేశారు.

దత్తత‌ విద్యార్థికి ఇంటి పట్టా అందజేసిన  క‌లెక్ట‌ర్
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : దత్త విద్యార్థి భరత్ చంద్ర కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తూ ఇంటి పట్టాను యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు మంగళవారం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన దత్త విద్యార్థి భరత్ చంద్ర చారి కుటుంబానికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే భరత్ చంద్ర ఆరోగ్య వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గతంలో కలెక్టర్ ఇచ్చిన హామీ ప్రకారం.. 200 గజాల ఇంటి స్థలాల పట్టాను అందజేశారు. అనంతరం భరత్ చంద్ర చారి కి వెంటనే ఇందిరమ్మ ఇల్లును కూడా మంజూరు చేయాలని స్థానిక ఎంపీడీవోను ఆదేశించారు. సంక్రాంతి పండగ అనంతరం మంచి రోజు చూసి ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేద్దామని భరత్ చంద్ర చారి కుటుంబానికి కలెక్టర్ భరోసానిచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తనతో చెప్పాలని భరత్ చంద్ర కోరిక ఎస్ఐ అయ్యేవంతవరకు తన ప్రోత్సహం ఇలాగే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, తహశీల్దార్ పీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రమోద్ కుమార్, ఎస్సై జగన్, ఆర్ఐ పాండు, పంచాయతీ కార్యదర్శి సుభాష్ ఉన్నారు.

Next Story