ఇంటర్ పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

by Naveena |
ఇంటర్ పరీక్షలను పరిశీలించిన కలెక్టర్
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ హనుమంతు రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణ తీరును కలియ తిరిగి పరిశీలించారు. విద్యార్థులు భయం, ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయలన్నారు. విద్యార్థులు పరీక్షకు ఎంతమంది హాజరయ్యారని సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, మెడికల్ సిబ్బంది ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో మందులను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ వారిని అభినందించారు.



Next Story