- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి నామినేషన్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి : కలెక్టర్ హనుమంతరావు
ప్రతి నామినేషన్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ హనుమంతరావు ఎన్నికల సిబ్బందికి సూచించారు.

దిశ, చౌటుప్పల్ టౌన్ : ప్రతి నామినేషన్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ హనుమంతరావు ఎన్నికల సిబ్బందికి సూచించారు. గురువారం ఆర్డీవో వెల్మ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డిలతో కలిసి ఆయన నామినేషన్ల స్వీకరణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమ్ ల పని విధానం ఎలా ఉందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వార్డుల వారీగా ఎన్ని నామినేషన్లు వచ్చాయని రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ల స్వీకరణ జరుగుతుందా లేదా అని అధికారులను అడిగారు. ఈ సంద్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి నామినేషన్ పత్రాన్ని నిశితంగా పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. నామినేషన్ ప్రక్రియను ప్రశాంతంగా.. పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో వెల్మ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ అధికారి అంజయ్య, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.






