పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

by Bhanu |   (  Updated:2025-12-10 10:48:05  IST  )

గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా నేడు జరగనున్న మొదటి విడత ఎన్నికలను ఇలాంటి లోటుపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం గ్రామ పంచాయతి ఎన్నికలలో భాగంగా మొదటి విడత ఎన్నికలు జరగనున్న తుర్కపల్లి మండల కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు.

పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
X

దిశ, యాదాద్రి భువనగిరి: గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా జరగనున్నమొదటి విడత ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత ఎన్నికలు జరగనున్న తుర్కపల్లి మండల కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఎన్నికల సామాగ్రి పంపిణి తీరుతెన్నులను కలెక్టర్ పరిశీలించారు. ఎలాంటి లోటు పాట్లకు తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కగా అందించాలని చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని అందినదా, లేదా అని పరిశీలించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story