- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా కలెక్టర్ దత్త విద్యార్థికి పది ఫలితాల్లో 73% మార్కులు
తెల్లవారుజామునే పదవ తరగతి విద్యార్థుల ఇంటి తలుపుతట్టే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని శేరిగూడం గ్రామానికి చెందిన భరత్ చంద్ర చారి ఆర్థిక పరిస్థితిని చూసి చలించారు.

దిశ, సంస్థాన్ నారాయణపురం: తెల్లవారుజామునే పదవ తరగతి విద్యార్థుల ఇంటి తలుపుతట్టే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని శేరిగూడం గ్రామానికి చెందిన భరత్ చంద్ర చారి ఆర్థిక పరిస్థితిని చూసి చలించారు. దీంతో సదరు విద్యార్థి పదవ తరగతి పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు ప్రతినెల 5000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరుకులను కూడా పంపిణీ చేశారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి తన పేరు నిలబెట్టాలని స్వయంగా భరత్ చంద్ర ఇంటికి వచ్చి మరి వెన్ను తట్టారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో శేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రచారి అనే విద్యార్థి 73% మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భరత్ చంద్ర చారి కి ఫోన్ చేసి అభినందించారు.తనకు ఇచ్చిన మాట ప్రకారం పదవ తరగతిలో మంచి మార్కులు సాధించడం పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే భరత్ చంద్ర చారి ఇంటికి వచ్చి సన్మానం చేస్తానని కూడా జిల్లా కలెక్టర్ ఫోన్ లో తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి భరత్ చంద్ర మాట్లాడుతూ...తాను పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం వెనుక కలెక్టర్ ప్రోత్సహం ఉందని భరత్ చంద్ర ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు .ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంటికి వచ్చి తనను వెన్ను తట్టి ప్రోత్సహించడంతో ఆత్మస్థైర్యం పెరిగి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించానని తెలిపారు.






