- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మునుగోడు మండల కేంద్రంలోని సైంట్ జోసెఫ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల డీఆర్సీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ, స్వీకరణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

దిశ, మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలోని సైంట్ జోసెఫ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల డీఆర్సీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ, స్వీకరణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీలో భాగంగా దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా మెటీరియల్‌ను పంపించాలని సూచించారు.
పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేసే సమయంలో స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ పేపర్ల ప్రాధాన్యతను తెలియజేయాలని, అలాగే ప్రతి పోలింగ్ టీం వారికి సంబంధించిన జోనల్ అధికారి, రూట్ అధికారుల ఫోన్ నెంబర్లు కలిగి ఉండాలని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు పీఓ డైరీ నిర్వహణ, టెండర్, ఛాలెంజ్ ఓట్ల విషయంలో తీసుకొనే జాగ్రత్తలు మరోసారి తెలియజేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఒకవేళ మెటీరియల్ సరిపోకపోతే తక్షణమే ఎంపీడీవో దృష్టికి తీసుకురావాలన్నారు. ఆమె వెంట జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పిసి ఈఓ శ్రీనివాసరావు, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, తదితరులు ఉన్నారు.






