- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు : కలెక్టర్ బడుగు చంద్రశేఖర్
యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామం సమీపంలోని గోదాములలోని యూరియాను ఆయన పరిశీలించారు.

X
దిశ, మిర్యాలగూడ : యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామం సమీపంలోని గోదాములలోని యూరియాను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, అక్రమాలకు పాల్పడిన అధికారులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియా అందజేస్తుండగా రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో యూరియా అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని సూచించారు. అధికారులు సకాలంలో రైతులకు యూరియా అందించి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, వ్యవసాయ అధికారులు సైదా నాయక్, గోడౌన్ అధికారులు పాల్గొన్నారు.
Next Story






