రోడ్డు ప్రమాదంపై సీఎం స్పందించాలి : జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు క‌విత

by Ratna Kumari |

సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మృతి చెంద‌డం అత్యంత విషాదకరమని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంపై సీఎం స్పందించాలి :  జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు క‌విత
X

దిశ, తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మృత్యువాత పడటం అత్యంత విషాదకరమని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె దీనిపై స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. కోటి భీమా కల్పిస్తామంటూ సీఎం ప్రకటన చేశారే తప్ప విధి విధానాలు ఖరారు చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కష్టపడుతున్నారని పేర్కొంటూ వారికి ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం దక్కకపోగా.. విధి వక్రీకరించి వారికి ఏమైనా జరిగితే ఆ కుటుంబాలకు కనీస భద్రత లేదని ఆమె తెలిపారు. శనివారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ప్రభుత్వ టీచర్ తో పాటు కేజీబీవీ ఎస్ఓకు రూ. కోటి అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. మృతులు కల్పన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ప్రమాదంలో గాయపడ్డ మిగతా టీచర్లు కోలుకొని క్షేమంగా బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు ఎస్.కృష్ణవేణి ఇస్మాయిల్ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ కుటుంబాలను పరామర్శించారు. సానుభూతిని వ్యక్తం చేశారు. తుంగతుర్తి మండల కేంద్రంలో ఉపాధ్యాయ లోకం సానుభూతిని వ్యక్తం చేస్తూ మౌనం పాటించింది.

Next Story