సీఎం పర్యటనకు భారీ భద్రత.. ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

by Bhanu |

తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

సీఎం పర్యటనకు భారీ భద్రత.. ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. బుధవారం ఆయన తిరుమలాపూర్ గ్రామంలో బహిరంగ సభస్థలిని పరిశీలించారు. హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, పబ్లిక్ గ్యాలరీ, స్టేజి, పైలాన్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. గంధమల్ల చెరువు వద్దకు వెళ్లి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటనకు పోలీస్ శాఖ తరపున పగడ్బందీ భద్రత చర్యలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. 1500 మంది. పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు‌. సభకు ప్రజలు వచ్చే బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఆయనతో పాటు డీసీపీ అక్షాంశ్ యాదవ్, యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాసానాయుడు, భువనగిరి ఏసీపీ కంకణాల రాహుల్ రెడ్డి, తుర్కపల్లి ఎస్ఐ తక్యూద్దీన్ ఉన్నారు.



Next Story