సీఎం దత్తత గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

by Web Desk |
సీఎం దత్తత గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
X

దిశ, ఎం తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా ఎం తుర్కపల్లి మండలం లో బుధవారం నాడు వాసాలమర్రి గ్రామంలో ఉన్న మూడు అంగన్ వాడి కేంద్రాలు, తిరుమలాపురం గ్రామం అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి పిల్లల పోషణ స్థితిని గమనించారు. పిల్లలతో ముచ్చటించి ఆటపాటల విద్య పరిశీలించారు. పిల్లలు తమ వయసుకు తగిన ఎత్తు, బరువు ఉండేలా పరిశీలిస్తుండాలని, పోషక ఆహార లోపం లేకుండా పిల్లలు పెరిగే విధానాన్ని గమనించాలని సూచించారు.

అంగన్వాడీలలోని న్యూట్రిషన్ గార్డెన్‌లను బాగా అభివృద్ధి చేయాలని సీడీపీఓ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, మండల స్పెషల్ ఆఫీసర్ ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి. శ్యాం, ఎంపిడివో ఉమాదేవి ఎంపీటీసీ నవీన్ కుమార్ సిడిపిఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed