రేపు దేవరకొండకు సీఎం రాక

by Nallavelli.Anjaneyulu |

దిశ, దేవరకొండ టౌన్ : దేవ‌ర‌కొండ‌లో జ‌రుగ‌నున్న ప్ర‌జా పాల‌న, ప్ర‌జా విజ‌యోత్స‌వాల బ‌హిరంగ స‌భ ప్రాంగ‌ణం, హెలిప్యాడ్ స్థ‌ల నిర్మాణం ఇత‌ర ఏర్పాట్ల‌ను శుక్ర‌వారం దేవ‌ర‌క‌ద్ర ఎమ్మెల్యే

రేపు దేవరకొండకు సీఎం రాక
X

దిశ, దేవరకొండ టౌన్ : దేవ‌ర‌కొండ‌లో జ‌రుగ‌నున్న ప్ర‌జా పాల‌న, ప్ర‌జా విజ‌యోత్స‌వాల బ‌హిరంగ స‌భ ప్రాంగ‌ణం, హెలిప్యాడ్ స్థ‌ల నిర్మాణం ఇత‌ర ఏర్పాట్ల‌ను శుక్ర‌వారం దేవ‌ర‌క‌ద్ర ఎమ్మెల్యే గ‌వినోళ్ల మ‌ధుసూద‌న్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్ట‌ర్ వంశీకృష్ణ‌తో క‌లిసి దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే నేనావ‌త్ బాలు నాయ‌క్ ప‌ర్య‌వేక్షించారు. శ‌నివారం సీఎం రేవంత్ రెడ్డి దేవ‌ర‌కొండ‌కు రానున్న విష‌యం తెలిసిందే. ప్ర‌జా విజ‌యోత్స‌వాల బ‌హిరంగ స‌భ‌కు ప్ర‌జ‌లు భారీగా హాజ‌ర‌య్యేందుకు తాగునీరు తో పాటు అవసరమైన మౌళి సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. స‌భ ప్రాంగ‌ణంలో అన్ని తాత్కాలిక నిర్మాణాలపై పలు మార్గదర్శకాలు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డ దేవరకొండ పర్యటన విజయవంతం కావడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు చేస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ముఖ్య నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story