ఎన్నికలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ నవీన్ కుమార్

by Bhanu |   (  Updated:2025-12-07 15:40:46  IST  )

గుర్రంపోడు మండలం మోసంగి, తెరాటి గూడెం గ్రామాలలో ఆ గ్రామ పోలీస్ అధికారి, గుర్రంపొడు ఎస్సై పసుపులేటి మధు, కొండమల్లేపల్లి సీఐ నవీన్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికలను ఉద్దేశించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఎన్నికలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ నవీన్ కుమార్
X

దిశ, గుర్రంపోడు: గుర్రంపోడు మండలం మోసంగి, తెరాటి గూడెం గ్రామాలలో ఆ గ్రామ పోలీస్ అధికారి, గుర్రంపొడు ఎస్సై పసుపులేటి మధు, కొండమల్లేపల్లి సీఐ నవీన్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికలను ఉద్దేశించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీఐ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు నిష్పాక్షికంగా, శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు, ఎన్నికల సమయంలో నిషేధిత కార్యకలాపాలపై వివరించారు. గ్రామ ప్రజలను ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించాలని, సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Next Story