డ్రగ్స్ ను నివారించరించడం మనంద‌రి బాధ్యత : సీఐ చంద్ర‌బాబు

by Nallavelli.Anjaneyulu |

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యువత డ్రగ్స్ బారిన పడకుండా నివారించడం మన అందరి సామాజిక బాధ్యత అని భువనగిరి రూరల్ సీఐ

డ్రగ్స్ ను నివారించరించడం మనంద‌రి బాధ్యత :  సీఐ చంద్ర‌బాబు
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యువత డ్రగ్స్ బారిన పడకుండా నివారించడం మన అందరి సామాజిక బాధ్యత అని భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం ఫకీర్ గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డ్రగ్ దందా చేసే వాళ్ళని వదిలి పెట్టకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. యువత డ్రగ్స్ కు బానిస కావడం వల్ల జీవితాలనే కోల్పోవాల్సి వస్తుందని యువత జాగ్రతగా ఉండాలని సూచించారు. గ్రామంలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణను మరింత మెరుగు చేయవచ్చు అన్నారు. ఒక్క సీసీ టీవీ కెమెరా వంద మంది కాపలాదారులకు సమానం అవుతుందన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకొని రాజకీయ పరిప్కవతతో మసులుకోవాలని గ్రామస్థులకు సూచించారు. నిత్యం పెట్రోలింగ్ ద్వారా నేరస్థుల కదలికలను పరిశీలిస్తున్నామన్నారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బొమ్మల రామారం ఎస్సై శ్రీశైలం, గ్రామ సర్పంచ్ బోయిని లత, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

Next Story