- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంతత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి: సీఐ ఆదిరెడ్డి
ప్రశాంతత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ పని చేస్తుందని చండూరు సీఐ ఆదిరెడ్డి, ఎస్సై వెంకన్న అన్నారు. ఆదివారం కొండాపురంలోని చండూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల ఓటు హక్కు వినియోగం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు వాటి అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

దిశ, చండూరు: ప్రశాంతత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ పని చేస్తుందని చండూరు సీఐ ఆదిరెడ్డి, ఎస్సై వెంకన్న అన్నారు. ఆదివారం కొండాపురంలోని చండూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల ఓటు హక్కు వినియోగం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు వాటి అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. గ్రామ మొదటి పౌరుడిని ఎన్నుకునే బాధ్యత గ్రామంలో ఉన్న ప్రతి ఓటరుకు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో సరైన అభ్యర్థి, తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. నేరాలు జరగకుండా నిరోధించటమే పోలీసుల లక్ష్యమన్నారు. ఒక్క రోజు ఎన్నికల్లో జరిగే పోలింగ్ వ్యవహారంలో స్నేహపూరిత వాతావరణాన్ని చెడగొట్టొద్దని సూచించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం, మాంసం, ఆభరణాలతో మభ్యపెడితే చర్యలు తప్పవన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్టులు పెడితే, ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని, గ్రూప్ అడ్మిన్ బాధ్యత ఉంటుందని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ పోలీస్ అధికారి శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






