- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రజెండా పార్టీలు అన్ని ఏకం అవ్వాలి : కూనంనేని సాంబశివరావు
ఎర్రజెండా పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

దిశ,చౌటుప్పల్: ఎర్రజెండా పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సమాజంలో కమ్యూనిస్టుల అవసరం ఉన్నదని, ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెలికంటి సత్యంలతో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడారు. మతోన్మాద బిజెపి కమ్యూనిస్టులపై రాక్షస నిరంకుశ పరిపాలన కొనసాగిస్తుందని వీటిని నిలువరించేందుకు ఎర్రజెండా వామపక్ష పార్టీలని ఒక తాటిపైకి వచ్చి ప్రజా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ప్రతి గ్రామంలో, గూడెంలో వందేళ్ల సిపిఐ చరిత్రను అమరుల త్యాగాలను, పోరాట ఘట్టాలను గుర్తు చేస్తూ అమరుల ఆశయాల ఆదర్శంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 8 నుండి 11 వరకు మేడ్చల్ లో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని సెప్టెంబర్ 18 నుండి 23 వరకు చండీగఢ్ లో జాతీయ మహాసభలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఆదివాసి ప్రజలను, మావోయిస్టులను చట్ట విరుద్ధంగా హత్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని ఈ హత్యలన్ని బిజెపి చేసిన హత్యలేనని, శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్కౌంటర్లు చేయడం అప్రజా స్వామికమని అన్నారు. వామపక్ష భావజాలాన్ని, మావోయిస్టులను అంతం చేయడం లక్ష్యంగా బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని మోడీ, అమిత్ షా ఆపరేషన్ కగారు చేపట్టి విచ్చలవిడిగా మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని విమర్శించారు.
ఆపరేషన్ కగారును నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు అందజేయాలని అన్నారు. అంతేకాకుండా మావోయిస్టుల మృతదేహాలు అందర్నీ వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి మావోయిస్టుల మృతదేహాలను చూసి కూడా భయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాబీర్ పాషా,రాష్ట్ర సమితి సభ్యుడు కే శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చనగోని గాలయ్య, సిపిఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, పగిళ్ల మోహన్ రెడ్డి, కలకొండ సంజీవ, ఉడత రామలింగం, ఎస్ ఏ రెహమాన్, టంగుటూరి రాములు, కొండూరు వెంకటేష్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.






