సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులా..? : చిరుమర్తి లింగయ్య

by Bhanu |

సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే , కేసులు నమోదు చేస్తూ నకిరేకల్ పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్ లా పనిచేస్తున్నారని నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఫైర్ అయ్యారు.

సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులా..? : చిరుమర్తి లింగయ్య
X

దిశ, నకిరేకల్ టౌన్ : నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు కందికంట నాగేంద్ర బాబు మీద సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసినందుకు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఉదయం నుంచి వికలాంగుడైన నాగేంద్ర బాబును పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించిన విషయంపై లింగయ్య స్టేషన్‌కు వెళ్లి పట్టణ సీఐ రాజశేఖర్‌ను నిలదీశారు.

వికలాంగుడు అయిన నాగేంద్ర బాబుని ఉదయం నుండి స్టేషన్ లో ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్ననందుకే అతడిని రెండవసారి పోలీస్ స్టేషన్ కి పిలిపించారన్నారని ఆయన తెలిపారు., "సచ్చినపుడు 10 వేలు సహాయం చేసేటోడు రాజకీయ భిచ్చగాడు, బ్రతికున్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటోడు ప్రజల నాయకుడు" అని సోషల్ మీడియాలో కామెంట్ చేసినందుకు లొకేషన్ ట్రేస్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంపై ఆయన మండిపడ్డారు. ఎవరికైనా పని అందులో ఏం తప్పు ఉందని ఆగ మేఘాల మీద పట్టుకురావటం ఏమిటని ప్రశ్నించాడు.


పోలీసులు చేయవలసిన ఎంక్వయిరీలు చేయరు రైతుల పైప్ లైన్లు పగలగొట్టిన తీసేసిన పట్టించుకోరు. వారిమీదే కేసు నమోదు చేస్తారని ఆరోపించారు. సంవత్సర కాలం నుండి పాపాలు మూట కొట్టుకుంటున్నారు ఆ పాపాలు తగులుతాయి అన్నారు. ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారండి ఇక్కడ కాకుంటే మరోచోట ఉద్యోగం వస్తుంది. మీ పోస్టుల కోసం ఆశ పడి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. మనసు చంపుకుని ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారని లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడుతూ. మా మండల అధ్యక్షుడు గల్ల పట్టుకోని నెట్టు వేస్తారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ అండదండలతోనే అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారనీ విమర్శించారు.

బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి, చట్టాన్ని అతిక్రమించిన అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదనీ హెచ్చరించారు. అన్ని విషయాలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ చెరుకుసుధాకర్, నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్. కట్టంగూరు మాజీ జెడ్పిటిసి తలారి బలరాం, మాజీ వైస్ చైర్మన్ గొర్ల వీరయ్య ,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రగాడపు నవీన్ రావు, సామ శ్రీనివాస్ రెడ్డి యానాల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story