చింతలపాలెం ఎస్సైగా సందీప్ రెడ్డి నియామకం

by Bhanu |

సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా ఎన్. సందీప్ రెడ్డి ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

చింతలపాలెం ఎస్సైగా సందీప్ రెడ్డి నియామకం
X

దిశ, హుజూర్ నగర్ /చింతలపాలెం : సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా ఎన్. సందీప్ రెడ్డి ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పనిచేసిన ఎస్సై అంతిరెడ్డి అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి పట్టుపడ్డ విషయం తెలిసిందే.. అప్పటినుండి ఇక్కడ మేళ్లచెరువు ఎస్సై పరమేష్ ఇంచార్జ్ ఎస్సైగా పనిచేస్తున్నారు. సుమారు రెండు నెలల నుండి ఈ ఎస్సై పోస్ట్ ఖాళీగా ఉండడం జరిగింది. చింతలపాలెం ఎస్సైగా ఎన్. సందీప్ రెడ్డి నియామకంతో ఈ పోస్టును భర్తీ చేశారు.అయితే 2014 బ్యాచ్ కి చెందిన సందీప్ రెడ్డి హైదరాబాదులోని పంజాగుట్ట, మహంకాళి, కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేశారు. ఆ తర్వాత 317 జీవోలో నల్లగొండ జిల్లాకు వచ్చి గత 3 ఏళ్లుగా నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ స్టేషన్లో ఎస్సైగా ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి చింతలపాలెం ఎస్సైగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Next Story