- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మానాన్న.. మాకు దిక్కెవరు ?
"అమ్మా… నాన్నా… మాకు ఇప్పుడు దిక్కెవరు?". ఈ మాటలు చిన్నపిల్లల నోటి నుంచి విన్నా, మనసు తడిచిపోవాల్సిందే. చిల్పకుంట్ల గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు చిన్నారులు ఇప్పుడు ఎటూ తేలని స్థితిలో ఉన్నారు.

దిశ, నూతనకల్: "అమ్మా… నాన్నా… మాకు ఇప్పుడు దిక్కెవరు?". ఈ మాటలు చిన్నపిల్లల నోటి నుంచి విన్నా, మనసు తడిచిపోవాల్సిందే. చిల్పకుంట్ల గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు చిన్నారులు ఇప్పుడు ఎటూ తేలని స్థితిలో ఉన్నారు. జీవితంలో చిన్నవయసులోనే తల్లిదండ్రుల కోల్పోయి అనాథలుగా మిగిలిన వారి విషాదగాథ ఇప్పుడు స్థానికులను కలిచివేస్తోంది.
కొన్ని సంవత్సరాల క్రితం పంతం పరుశరాములు అనే వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి అతడి భార్య సుభద్ర, పిల్లలను పోషించేందుకు అనేక కష్టాలు భరిస్తూ జీవన పోరాటం చేసింది. కానీ… వారం రోజుల క్రితం ఆమె కూడా అనారోగ్యంతో మరణించింది.
తల్లిదండ్రులిద్దరూ లేకుండా అనాథలుగా మిగిలిన ముగ్గురు చిన్నారులు ఇప్పుడు నివాసానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. బతుకుదెరువు లేక తిండి కోసం ఎదురుచూస్తూ.. అక్కున చేర్చుకునే వారి కోసం ఆత్రంగా చూస్తున్నారు. రి పరిస్థితిని చూసిన గ్రామస్థులు చలించి, సమాజం నుంచి ఆదరణ అవసరమంటూ కోరుతున్నారు. కనీస అవసరాలకు కొంతమంది దాతలు ముందుకు రాకపోతే వీరి పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది.






