- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలను చిన్నప్పటి నుంచి బడికి పంపాలి : సర్పంచ్ పులికంటి సుధాకర్
పిల్లలను చిన్నప్పటి నుంచి బడికి పంపాలని సర్పంచ్ ఫోరం నేరేడుగొమ్ము మండల అధ్యక్షుడు పులికంటి సుధాకర్ పేర్కొన్నారు.

దిశ, నేరేడుగొమ్ము : పిల్లలను చిన్నప్పటి నుంచి బడికి పంపాలని సర్పంచ్ ఫోరం నేరేడుగొమ్ము మండల అధ్యక్షుడు పులికంటి సుధాకర్ పేర్కొన్నారు. పీసీపీసీ బాలల పరిరక్షణ కమిటీ అంగన్ వాడి సూపర్ వైజర్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యతిథిగా సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధాకర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు చేయకూడదని ఆడపిల్ల 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లిలు చేయకూడదని.. ఆడపిల్లలను చదివించాలన్నారు. ఆడపిల్ల చదువు అవనికి వెలుగు లాంటిదని ఆడపిల్లలను చదువుకోనివ్వాలన్నారు. అంగన్ వాడి సూపర్ వైజర్ మేరీ, టీచర్ నీరంజనమ్మ, గ్రామ స్వచ్ఛంద సంస్థ మీనా కుమారి, ఆశావర్కర్లు అరుణ, ఉప సర్పంచ్ ఎలిజర్ల శ్రీను, కిషోర్ బాలికల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, యువకులు గర్భిణి స్త్రీలు గ్రామస్తులు పాల్గొన్నారు






