- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిశువుల కొనుగోలు..!
by Ratna Kumari |
దిశ, మిర్యాలగూడ : రోజుల వ్యవధిలో పిల్లలు లేని రెండు కుటుంబాల దంపతులు శిశువులను కొనుగోలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. దామరచర్ల

X
దిశ, మిర్యాలగూడ : రోజుల వ్యవధిలో పిల్లలు లేని రెండు కుటుంబాల దంపతులు శిశువులను కొనుగోలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. దామరచర్ల మండలంలోని మాన్ సింగ్ తండాలో అక్రమంగా రెండు కుటుంబాలు శిశువులను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంగన్ వాడీ టీచర్ చేపట్టిన సర్వేలో గ్రామంలో ఇద్దరు నూతన శిశువులను గుర్తించినట్లు తెలిసింది. పిల్లలు లేకపోవడంతో దంపతులు కొనుగోలు చేశారా..? లేక దత్తత తీసుకున్నారా..? అనే అంశంపై సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇద్దరి శిశువులలో ఒకరిని సాగర్ మండలం ప్రాంతం నుంచి మరొకరిని త్రిపురారం మండలం నుంచి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే ఓ క్లారిటీ వస్తోంది.
Next Story






