సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా చెన్నకేశి వెంకయ్య ఎన్నిక

by Nallavelli.Anjaneyulu |

చింతలపాలెం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా చెన్నకేశి వెంకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా చెన్నకేశి వెంకయ్య ఎన్నిక
X

దిశ, చింతలపాలెం : చింతలపాలెం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా చెన్నకేశి వెంకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొల్లా భూలక్ష్మి, షేక్ అమీరున్ బిని ఉపాధ్యక్షులుగా, కొండపల్లి సుందర్ రావును ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. అలాగే మాలవత్ శారద, ఐలపంగు మాధవిని సర్పంచ్ ల ఫోరం కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో చింతలపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరాల కొండారెడ్డి, నాయకులు చిలకల శ్రీనివాసరెడ్డి, నందిరెడ్డి ఇంద్రారెడ్డి పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ల ఫోరం నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story