హాస్టల్‌ భోజనం చూసి కలెక్టర్ రియాక్షన్ చూడండి

by Naveena |   (  Updated:2025-01-21 15:17:29  IST  )

భువనగిరి పట్టణం సింగన్నగూడెంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హాస్టల్‌ భోజనం చూసి కలెక్టర్ రియాక్షన్ చూడండి
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : భువనగిరి పట్టణం సింగన్నగూడెంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వార్డెన్ విజయలక్ష్మి కి షోకాస్ నోటీస్ జారీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. వెంటనే డ్రైనేజ్ పనులను పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. హాస్టల్ స్టూడెంట్స్ కోసం హైదరాబాద్ చౌరస్తా వద్ద బస్ ఆపాలని ఆర్టీసీ డీఎం కి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు కోరిన విధంగా కంప్యూటర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్టూడెంట్స్ కోరికపై కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.

Next Story