భూ భార‌తి నిధుల‌తో ప్ర‌భుత్వ ఖ‌జానాకు మోసం

by Ratna Kumari |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూభారతి పోర్టల్ యాప్ ద్వారా రైతుల భూమి అమ్మకాల కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తమ సొంత ఖాతాలోకి మలుచుకున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచినట్టు రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు వలిగొండ ఎస్సై యుగేందర్ గౌడ్ లు తెలిపారు.

భూ భార‌తి నిధుల‌తో ప్ర‌భుత్వ ఖ‌జానాకు మోసం
X

దిశ, వలిగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూభారతి పోర్టల్ యాప్ ద్వారా రైతుల భూమి అమ్మకాల కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తమ సొంత ఖాతాలోకి మలుచుకున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచినట్టు రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు వలిగొండ ఎస్సై యుగేందర్ గౌడ్ లు తెలిపారు. ఈ మేరకు భూభారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని తమ సొంత ఖాతాల్లోకి నిధులను మళ్లించుకున్న వ్యక్తులైన మధు, భువనేష్, రాజు, రాకేష్, శివరామకృష్ణ పై తహశీల్దార్ దశరథ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించి కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు. తదుపరి విచారణ చేసి వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని శుక్రవారం వలిగొండ ఎస్సై యుగేందర్ గౌడ్ తెలిపారు.

Next Story