గ్యాస్ డెలివరీలో అధిక ధరలు వసూలు చేస్తే కేసులే

by velandi.Saikiran |

గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే డీలర్ లపై, డెలివరీ బాయ్ లపై క్రిమినల్ కేసులు కేసులు చేస్తామని పౌర సరఫరాల శాఖ

గ్యాస్ డెలివరీలో అధిక ధరలు వసూలు చేస్తే కేసులే
X

దిశ, మర్రిగూడ (నాంపల్లి): గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే డీలర్ లపై, డెలివరీ బాయ్ లపై క్రిమినల్ కేసులు కేసులు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తహశీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన నాంపల్లిలో మాట్లాడుతూ.. కొందరు డీలర్లు, గ్యాస్ డెలివరీ బాయ్ ల అక్రమాల వల్ల అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆక్షేపించారు. గ్యాస్ డీలర్ షిప్ అనేది లాభాపేక్షతో కూడిన వ్యాపారం కాదని రఘునందన్ స్పష్టం చేశారు. సేవా భావంతో కూడిన స్వయం ఉపాధి పథకం గ్యాస్ డీలర్ షిప్ అని వివరించారు. చమురు సంస్థలు... డోర్ డెలివరీ ఛార్జీలు డీలర్ లకు చెల్లిస్తున్నాయని చెప్పారు.

Next Story