మానవత్వాన్ని చాటుకున్న ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్

by Kodari Anjali |

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మహిళకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు.

మానవత్వాన్ని చాటుకున్న ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్
X

దిశ, చిట్యాల: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మహిళకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల క్రితం చిట్యాల మండలంలోని వట్టిమర్తి జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో దూదిగామ యాదమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగిపోవడంతో సర్జరీ నిమిత్తం నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్‌లో చేర్పించారు. ఆపరేషన్ చేయడానికి ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో బాధితురాలి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ ముందుకు వచ్చి శనివారం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసమే ఆసరా సేవా సంస్థను నెల కోల్పానని అందులో భాగంగానే మహిళకు రక్తదానం చేశానన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకొని ప్రాణాపాయంలో ఉన్నవారికి తోడ్పాటు అందించాలన్నారు.

Next Story