- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాక్ చేస్తున్నాం : ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డి
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాక్ చేస్తున్నాం : ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డి
మండలంలోని బసంతపురం గ్రామంలో పెద్ద పులి లేగ దూడను చంపిన సంఘటనతో ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని మంగళవారం సందర్శించారు.

X
దిశ, రాజాపేట : మండలంలోని బసంతపురం గ్రామంలో పెద్ద పులి లేగ దూడను చంపిన సంఘటనతో ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని మంగళవారం సందర్శించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటుతో ట్రాక్ చేసి బోన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మండలంలోని రేణికుంట, లక్ష్మక్కపల్లి, చల్లూరు గ్రామాలలో పులి పాదముద్రలు ఉన్నట్లు గుర్తించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని రాత్రి వేళలో వ్యవసాయ బావుల వద్ద పశువులను కట్టి వేయవద్దని ఇంటి దగ్గరికి తెచ్చుకోవాలని సూచించారు. పులి చంపిన లేగ దూడ పశు వైద్యాధికారి పోస్టుమార్టం పంచనామా నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు లిఖిత ఉన్నారు.
Next Story






