నకిలీ వస్తువుల విక్రయిస్తుండగా పట్టివేత

by Nallavelli.Anjaneyulu |

హుజూర్ నగర్ పట్టణంలో నకిలీ ఉత్పత్తుల కలకలం రేగింది. సోమవారం రాత్రి హుజూర్ నగర్ పట్టణంలో

నకిలీ వస్తువుల విక్రయిస్తుండగా పట్టివేత
X

దిశ, హుజూర్ నగర్ : హుజూర్ నగర్ పట్టణంలో నకిలీ ఉత్పత్తుల కలకలం రేగింది. సోమవారం రాత్రి హుజూర్ నగర్ పట్టణంలో ఒక వాహనంలో వచ్చి నిత్యవసర వస్తువులైన పారాచూట్ కొబ్బరినూనె, మైసూర్ శాండిల్ సబ్బుల పేరుతో నకిలీ వస్తువులను విక్రయిస్తుండగా స్థానిక డిస్ట్రిబ్యూటర్లు పట్టుకున్నారు. అసలైన బ్రాండ్ల ప్యాకింగ్‌ను పోలి ఉన్న వీటిని గుర్తించి విక్రయదారులను నిలదీశారు. నకిలీ వస్తువులతో వినియోగదారులను మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పట్టుకున్న వానాన్ని పోలీసులు అప్పగించినట్లు సమాచారం.

Next Story