- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి గాయాలు
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి గాయాలు
by Bhanu |
వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ కు చెందిన చేగూరి రామస్వామి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు బీబీనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి రంగపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కుతుండగా కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 8 మంది నలుగురు పెద్దలు, నాలుగురు చిన్న పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Next Story






