వరి కొయ్యలకు నిప్పు.. భూసారానికి ముప్పు

by Bhanu |

పశువుల మేతకు ఉపయోగపడే వరి గడ్డిని గతంలో అన్నదాతలు ప్రాణప్రదంగా భావించేవారు.

వరి కొయ్యలకు నిప్పు.. భూసారానికి ముప్పు
X

దిశ,నాగారం: పశువుల మేతకు ఉపయోగపడే వరి గడ్డిని గతంలో అన్నదాతలు ప్రాణప్రదంగా భావించేవారు. పోచ.. పోచ జమచేసి కుప్పేసి ఏడాదంతా పశువులకు మేతగా వాడేవారు.ఆధునిక వ్యవసాయం,పశువుల సంఖ్య తగ్గడంతో ప్రస్తుతం గడ్డిని మడిలోనే తగుల బెడుతున్నారు.పంట పొలాల్లో కొయ్యలను కాల్చేస్తే వాయు కాలుష్యమే కాకుండా సూక్ష్మ జీవులు,పోషకాలు కూడా నశిస్తున్నాయి.వ్యవసాయ అధికారులు వరి కొయ్యలను కాల్చవంద్దంటున్న మెజారిటీ రైతులు మాత్రం వరి కొయ్యలను కాల్చేస్తున్నారు.వరి కొయ్యలు ఉంటే అలాగే వాటిని బురదలో దున్నితే అవి మురిగి పొలాలకు ఎరువుగా ఉపయోగపడతాయి.కానీ వాటిని కాల్చేస్తె వాయు కాలుష్యంతో పాటు రైతులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.వరి కొయ్యలు కాల్చడంతో నేలలోని నత్రజని,ఫాస్పరస్,పొటాషియం వంటి పోషకాలు నశించిపోతాయి.చిన్నపాటి చర్యలతో వరి కొయ్యలే సిరులు కురిపిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.దీనిపై కింది స్థాయిలో గ్రామాల్లో డప్పు చాటింపులు వేసి రైతులను ఏకం చేసి వ్యవసాయ సిబ్బందితో రైతులకు అవగాహన కల్పించేలా ఏర్పాటు చేయాలి.

Next Story