- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేరేడుచర్లలో రెండు వైన్ షాపుల్లో చోరీ
by Ratna Kumari |
నేరేడుచర్లలో రెండు వైన్ షాపుల్లో దొంగతనం జరిగింది. రూ.75వేల నగదుతో పాటు మద్యం బాటిళ్లు చోరీకి గురయ్యాయి.

X
దిశ, నేరేడుచర్ల : నేరేడుచర్లలో రెండు వైన్ షాపుల్లో దొంగతనం జరిగింది. రూ.75వేల నగదుతో పాటు మద్యం బాటిళ్లు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లలో గుర్తు తెలియని వ్యక్తి రెండు వైన్ షాపుల్లో దొంగతనానికి పాల్పడ్డాడు. శివాంజనేయ వైన్స్, విజయ దుర్గ వైన్స్ లో సోమవారం రాత్రి ఒకటిన్నర సమయంలో దొంగతనం జరిగినట్టు వైన్ షాప్ యజమాని వేణు గుర్తించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీమ్ ని పిలిపించారు. నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఎస్సై రవీందర్ తెలిపారు.
Next Story






