లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో బలమైన శక్తిగా BRS: మంత్రి జగదీష్ రెడ్డి

by Satheesh |

లోకసభ ఎన్నికల నాటికి దేశంలో బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో బలమైన శక్తిగా BRS: మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, సూర్యా పేట ప్రతినిధి: లోకసభ ఎన్నికల నాటికి దేశంలో బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ ఉన్న నాయకుడిగా దేశ ప్రజల్లో ముఖ్య మంత్రి కేసీఆర్‌కు ఎనలేని ఆదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీ‌ఆర్‌ఎస్ నమోదు చేసుకున్న విజయంపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ మహరాష్ట్రలో సృష్టించిన ప్రభంజనం సెగలు హస్థినను తాకుతున్నాయాన్నారు. ఎత్తుగడలో భాగంగానే కర్ణాటక ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉన్నదని ఆయన వెల్లడించారు. బీఆర్‌ఎస్ పోటీలో లేక పోవడమే అక్కడ కాంగ్రెస్ గెలుపుకు దోహద పడిందన్న అంశాన్ని విస్మరించరాదన్నారు.

Next Story