జగదీష్ రెడ్డి పై సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : కంచర్ల రామకృష్ణారెడ్డి

by Bhanu |

నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి పై

జగదీష్ రెడ్డి పై సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం :  కంచర్ల రామకృష్ణారెడ్డి
X

దిశ, తిరుమలగిరి: నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.తుంగతుర్తి నియోజకవర్గంలో 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, 20 నెలల కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సోమవారం జరిగిన సభకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని నియోజకవర్గానికి నిధుల వర్షం కురిపిస్తారని స్థానిక ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తే తుంగతుర్తి నియోజకవర్గానికి మొండిజేయ్యి చూపించాడని ఆరోపించారు.


సీఎం ప్రసంగంలో పసలేదని పూర్తిగా కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా ప్రసంగించారని ఆరోపించారు.గత 10సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆరు సంవత్సరాలు కాలేశ్వరం నీళ్లతో నియోజకవర్గంలోని ప్రతి ఏకరాకు నీళ్లు ఇచ్చిన ఘనత జగదీష్ రెడ్డి, గాదరి కిషోర్ లతోనే సాధ్యమైందని అన్నారు. రైతులకు ఉచిత స్వచ్ఛమైన కరెంటు, రైతుబంధు ఇలాంటి పథకాలు ఇచ్చి రైతును రాజుగా చేశారని,ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రైతులు తీవ్ర ఇబ్బందులతో గురవుతున్నారని అన్నారు.


కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు మొదలయ్యాయని, కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే రైతులను కాటేసిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున రేషన్ కార్డులు, సన్న బియ్యం,రైతు భరోసా ఇస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినాక ఈ పథకాలను పూర్తిగా బంద్ చేస్తారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కామినేని సతీష్, యుగంధర్ రావు, రజాక్, సీతయ్య, ప్రభాకర్ రెడ్డి, అడ్డగూడూర్ మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య,విష్ణువర్ధన్,శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story