తెలంగాణ‌లో రాక్షస పాలన నడుస్తోంది

by velandi.Saikiran |

హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణ‌లో రాక్షస పాలన నడుస్తోంది
X

దిశ, చింతలపాలెం: హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. చింతలపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ..... యూరియా సమస్యపై ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. యూరియా అందక రైతులు కష్టాలు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేద‌ని.. కొంచెం గట్టిగా అడిగితే రైతుల ఇళ్లకు పోలీసులను పంపిస్తున్నారని నిప్పులు చెరిగారు. దీనిపై ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్‌తో చట్టబద్ధంగా నిర్వహించాలన్నారు. అక్రమ అరెస్టులు, కేసులు ఆపాలని, ప్రభుత్వ అవినీతి, అణచివేతలకు భవిష్యత్తులో జవాబు చెప్పబడనుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ రెడ్డి, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, చింతలపాలెం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మధిర సత్యనారాయణ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పోల్నేడి శ్రీనివాస్, దొండపాడు బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పోతంశెట్టి శ్రీనివాసరావు,మండల నాయకులు షేక్ మైబెల్లి మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్, కందుల శ్రీనివాస్ రెడ్డి, గోవింద్ రెడ్డి,లాలయ్య, నరేష్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story