- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్ శంకర్ రావు
by Bhanu |
మండలంలోని పాలెఅన్నారం (నారాయణపురం) గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తమ్మనబోయిన శంకర్ రావు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నలమాద పద్మావతి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

X
దిశ, చిలుకూరు: మండలంలోని పాలెఅన్నారం (నారాయణపురం) గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తమ్మనబోయిన శంకర్ రావు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నలమాద పద్మావతి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితుడనై పార్టీలో చేరానని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి సూచనల మేరకు గ్రామంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దేశబోయిన రాంబాయి గెలుపునకు శ్రమిస్తామన్నారు. పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన వెంట ఉన్నారు.
Next Story






