- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో చేరుతున్న బీఆర్ఎస్ శ్రేణులు..!
ప్రజలకు చేరువగా సేవలందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో డిండి మండలంలోని జేత్య తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ లచ్చిరామ్, మూడావత్ కర్ణాకర్‌తో పాటు 10కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దిశ, దేవరకొండ టౌన్: ప్రజలకు చేరువగా సేవలందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో డిండి మండలంలోని జేత్య తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ లచ్చిరామ్, మూడావత్ కర్ణాకర్‌తో పాటు 10కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధత తమను ఆకట్టుకుందని, అందుకే ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు పార్టీలో చేరిన వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా పార్టీ శ్రేణులు, కొత్తగా చేరిన నాయకులు చురుకుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు చేరువగా సేవలందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, YS కర్ణాకర్, మాజీ సర్పంచ్ కిషన్ నాయక్, నాయకులు సేవ్య, తుల్చ్య,పవన్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.






