ఎమ్మార్పీ కాలువలో జారిపడి బాలుడు మృతి

by Bhanu |

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ప్రధాన కాలువలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.

ఎమ్మార్పీ కాలువలో జారిపడి బాలుడు మృతి
X

దిశ, పెద్దఅడిశర్లపల్లి : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ప్రధాన కాలువలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్సై నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్యాల గ్రామానికి చెందిన మట్టిపల్లి శివతేజ 8 పశువులను మేపెందుకు పొలానికి వెళ్ళాడు. శివతేజకు దాహం కావడంతో పక్కనే ఉన్న ఎమ్మార్పీ కాలువలోకి నీళ్లు త్రాగేందుకు కాలువలోకి దిగాడు. అంతలోనే ప్రమాదవశాత్తు జరిగి కాలు జారిపడి పోయాడు. కేకలు వేయడంతో పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు గమనించి శివతేజ కాపాడేందుకు ప్రయత్నించారు కానీ ఫలితం దక్కలేదు అందులోనే మృతి చెందాడు. శివతేజ మూడో తరగతి చదువుతున్నాడు సెలవులు కావడంతో తన తల్లిదండ్రులు పశువులను కాయడానికి పంపారు. శివ తేజ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మునిరయ్యారు. దుగ్యాల గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. తండ్రి మట్టిపల్లి ముత్యాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శివతేజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story