- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ రిజర్వేషన్ల అమలుకు బీజేపీ మోకాలడ్డు: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
దిశ, చిట్యాల : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయరంగంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు

దిశ, చిట్యాల : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయరంగంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఖమ్మంలో జరగబోయే సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు గద్వాల నుండి ఖమ్మం వరకు జరుగుతున్న బస్సు యాత్ర బుధవారం సాయంత్రం నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా బస్సు యాత్రకు నకరేకల్ సీపీఐ నియోజకవర్గ సమితి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ఎన్నో ఉద్యమాలు జరిగాయని, సిపిఐ కార్మిక హక్కుల కోసం పోరాటం చేసి వారి హక్కుల సాధనలో ఎంతో కృషి చేసిందన్నారు. నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిందని, భూస్వామ్య వ్యవస్థ నుండి దున్నేవాడికే భూమిపై హక్కు ఉండే విధంగా పోరాటాలు సాగించారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి. కానీ బూటకపు ఎన్ కౌంటర్ పేరుతో మానవ హక్కులకు భంగం కలిగిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతుల వ్యతిరేక చట్టాలను చేసి కార్మికులకు, హర్షకులకు అన్యాయం చేస్తుందని , కార్మిక కర్షకుల హక్కుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడు పోరాటం చేస్తుందని ప్రతి ఒక్కరు వాటికోసం కలిసి రావాలని అన్నారు. ఈ బస్సు యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎన్ బాల నరసింహా, నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రావణ్ , ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్దే శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జగన్, గీత పనివారిలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడిగ సైదులు , జిల్లా యాదయ్య, సిపిఐ చిట్యాల మండల నాయకులు పాల్గొన్నారు.






