కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకు బీజేపీ కుట్ర : సీఐటీయూ

by Ratna Kumari |

దిశ‌, హాలియా : కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ ఆరోపించారు.

కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకు బీజేపీ కుట్ర : సీఐటీయూ
X

దిశ‌, హాలియా : కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ ఆరోపించారు. గురువారం హాలియాలోని సుందరయ్య భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాలు అనేక పోరాటాల నిర్వహించి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో పేదల పొట్ట కొట్టే విధంగా విబిజి రాంజీ చట్టం తేవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ సహజ వనరులను స్వదేశీ విదేశీ కార్పొరేట్ చెక్కులకు అప్పజెప్పడం మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ విధానంగా మారిందని...ఈ విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఈనెల 2న హాలియాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, జీపు జాతర ద్వారా ప్రజలను చైతన్య పరుస్తామని వివరించారు. ఈనెల 19న నల్లగొండలో కార్మికులు రైతులచే సభ నిర్వహించి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తామని తెలిపారు. సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్కే బషీర్, జటావత్ రవి నాయక్, దుబ్బా రామచంద్రయ్య, రేబల్లి వెంకటేశ్వర్లు, పొదిల వెంకన్న, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story