వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు: Raghunandan Rao

by Taduka Kalyani |   (  Updated:2022-12-15 10:58:33  IST  )

వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించి రాష్ర్టంలో అధికారంలోకి రాబోతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు: Raghunandan Rao
X

దిశ, నల్లగొండ: వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించి రాష్ర్టంలో అధికారంలోకి రాబోతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన 'ప్రజాగోసా-బీజేపీ భరోసా' యాత్ర బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ పడ్డోడు ఎప్పుడూ చెడ్డోడు కాదని, బీజేపీ కార్యకర్తలు ఓపికతో ఉండి ప్రజలకు భరోసా కల్పించాలని తెలిపారు. కవిత ఎలాంటి తప్పు చేయకపోతే లక్షల విలువైన మొబైల్ ఫోన్లను ఎందుకు పగలగొట్టారన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అనేది ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరూ చేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. నల్లగొండ జిల్లాలో మెజార్టీ శాసనసభ స్థానాలని బీజేపీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్ అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read...

సిరిసిల్లలో బీఆర్ఎస్ షాక్.. బీజేపీలో చేరిన సెస్ మాజీ చైర్మన్

Next Story