- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిగివచ్చిన నాగం.. జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ
దిశ నల్లగొండ బ్యూరో: జర్నలిస్టులపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దాడి చేసి బలవంతంగా

దిశ నల్లగొండ బ్యూరో: జర్నలిస్టులపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దాడి చేసి బలవంతంగా కెమెరాలు లాక్కొని ఫొటోలు డిలీట్ చేయడాన్ని నిరసిస్తూ.. బీజేపీ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ధర్నా విరమించుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్ జర్నలిస్టులను సముదాయించారు. అయినా వాళ్లు అంగీకరించలేదు. అయితే క్షమాపణ చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని జర్నలిస్టులు పట్టుబట్టారు. దీంతో తప్పని పరిస్థితిలో జర్నలిస్టుల ఉద్యమానికి దిగి వచ్చిన నాగం వర్షిత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసుకుంటామని.. జర్నలిస్టులు క్షమించాలని రెండు చేతులు జోడించి నమస్కరించారు. దీంతో జర్నలిస్టులు తమ నిరసనను ఉపసంహరించుకున్నారు.






