- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాడీగార్డ్ల బందోబస్తుతో బిజెపి అభ్యర్థి హంగామా..
ఎన్నికల బరిలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న రీతిలో ప్రయత్నిస్తుంటారు.

దిశ, భూదాన్ పోచంపల్లి: ఎన్నికల బరిలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న రీతిలో ప్రయత్నిస్తుంటారు. అయితే, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన ఓ మహిళా నేత ఏకంగా ప్రైవేట్ సెక్యూరిటీని వెంటబెట్టుకుని రావడం పట్టణంలో ఆసక్తికరంగా మారింది. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు రిజర్వేషన్ జనరల్ మహిళ రావడంతో బీజేపీ అభ్యర్థిగా తంగెళ్ల అండాలు శుక్రవారం తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. సాధారణంగా అభ్యర్థులు తమ అనుచరులు, కార్యకర్తలతో ర్యాలీగా రావడం సహజం.
కానీ, తంగెళ్ల అండాలు మాత్రం సూటు, బూటు ధరించిన ప్రైవేట్ బాడీగార్డ్ల బందోబస్తుతో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమ నాయకురాలు నామినేషన్ వేయడానికి వస్తున్న సమయంలో బాడీగార్డ్లు ఆమె చుట్టూ రక్షణ వలయంలా ఏర్పడి హంగామా చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, తోటి రాజకీయ నాయకులు ఆశ్చర్యపోయారు. మున్సిపల్ ఎన్నికల స్థాయిలో ఇంతటి భారీ ప్రైవేట్ సెక్యూరిటీతో నామినేషన్ వేయడం ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.






