- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి కార్డులు పంచటానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. కనగల్లు ఎస్ఐ పి.విష్ణు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ మండలం ముషంపల్లి గ్రామానికి చెందిన తౌడోజు వెంకటాచారి (50) నల్గొండ లోని క్రాంతి నగర్ లో నివాసం ఉంటున్నాడు.

నల్గొండ, కనగల్లు : పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. కనగల్లు ఎస్ఐ పి.విష్ణు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ మండలం ముషంపల్లి గ్రామానికి చెందిన తౌడోజు వెంకటాచారి (50) నల్గొండ లోని క్రాంతి నగర్ లో నివాసం ఉంటున్నాడు. నకిరేకల్ లో ఉంటున్న తన బామ్మర్ది సంకోజు వీరాచారి కుమార్తె పెళ్లి కార్డులు కనగల్లు మండలంలో తన బంధువులకు పంచి తిరిగి నల్గొండకు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్తుండగా జి.చెన్నారం గ్రామం సమీపంలో బైకు అతివేగంగా ఉండడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టడంతో వెంకటాచారి తలకు బలంగా దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






