భువనగిరి బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీపీ

by Malleboina Mahesh |   (  Updated:2023-11-20 08:14:00  IST  )

భువనగిరి బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. భువనగిరి ఎంపీపీ నరాల‌ నిర్మలవెంకటస్వామి అధికార పార్టీని వీడి హస్తం గూటికి చేరుకున్నారు.

భువనగిరి బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీపీ
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. భువనగిరి ఎంపీపీ నరాల‌ నిర్మలవెంకటస్వామి అధికార పార్టీని వీడి హస్తం గూటికి చేరుకున్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ ‌నియోజకవర్గ నాయకులు, బీబీనగర్ మండలం గూడూరు సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి, బీబీనగర్ మాజీ ఎంపీపీ ఇసరపు అచ్చయ్య గౌడ్, కాటేపల్లి గోపాల్ రెడ్డిలు, మాజీ వైస్ ఎంపీపీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సైతం హస్తం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోతుందన్నారు. ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇదే ఉత్సాహం, ప్రజల విశ్వాసంతో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు.

Next Story