అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం..

by Bhanu |   (  Updated:2025-05-26 10:27:16  IST  )

భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామ శివారు నుండి జగత్ పల్లి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఓ చెట్టు తీగ అల్లుకుపోయి విద్యుత్ తీగల వరకు పారి ప్రమాదకరంగా ఉంది.

అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం..
X

దిశ, భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామ శివారు నుండి జగత్ పల్లి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఓ చెట్టు తీగ అల్లుకుపోయి విద్యుత్ తీగల వరకు పారి ప్రమాదకరంగా ఉంది. కురుస్తున్న వర్షాల కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి తీగను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story