అదుపుతప్పి బొలెరో బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం

by Bhanu |   (  Updated:2025-05-27 12:18:53  IST  )

ప్రమాదవశాత్తు అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని భద్రావతి కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది.

అదుపుతప్పి బొలెరో బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, భూదాన్ పోచంపల్లి : ప్రమాదవశాత్తు అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని భద్రావతి కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి బొలెరోలో జగత్ పల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలో బొలెరోకు ఎదురుగా ఇంకో వాహనం అడ్డుగా రావడంతో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బొలెరో పాక్షికంగా దెబ్బతింది. ఎటువంటి ప్రమాదం జరగకుండా డ్రైవర్ సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది.

Next Story