- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhayya Sunny Yadav : కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు.. భయ్య సన్నీ యాదవ్ తండ్రి రవి కీలక వ్యాఖ్యలు
యూట్యూబర్ బయ్య సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వివాదస్పదమైన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై బయ్య సన్నీ యాదవ్ తండ్రి బయ్య రవి 'దిశ' తో మాట్లాడుతూ.. పాకిస్తాన్ టూర్ ముగించుకుని ఇండియాకి వచ్చిన సన్ని యాదవ్ యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేశాడు అని వివరించారు. అయితే..

దిశ, సూర్యాపేట : యూట్యూబర్ బయ్య సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వివాదస్పదమైన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై బయ్య సన్నీ యాదవ్ తండ్రి బయ్య రవి 'దిశ' తో మాట్లాడుతూ.. పాకిస్తాన్ టూర్ ముగించుకుని ఇండియాకి వచ్చిన సన్ని యాదవ్ యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేశాడు అని వివరించారు. అయితే.. సన్నీ యాదవ్ ఇటీవల పాకిస్తాన్ లో బైక్ రైడ్ పూర్తి చేసి యూట్యూబ్ లో వీడియోలు విడుదల చేశాడు. పాకిస్తాన్ లో పాకిస్తాన్ నివాసుడితో జైశ్రీరామ్ అంటూ ఓ వీడియో, పాకిస్తాన్ లో సిమ్ము కోసం ఎన్నో కష్టాలు అనే వీడియో, హైదరాబాద్ టు పాకిస్తాన్ బైక్ పై సాహస యాత్ర అనే వీడియో, పాకిస్తాన్ ఆర్మీ వ్యక్తి షాక్ అనే పలు వీడియోలు సన్నీ యాదవ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. అయితే ఆ వీడియోలు పాకిస్తాన్ టూర్ ముగించుకొని ఇండియా వచ్చిన కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడని సన్నీ యాదవ్ తండ్రి తెలిపారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధుర్ సమయంలో సన్నీ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఉన్నాడని ఆయన తెలిపారు. కొన్ని వీడియోలు నూతనకల్ మండలం నుంచి విడుదల చేశాడనీ, నెట్వర్క్ ప్రాబ్లం ఉండడంతో హైదరాబాద్ వెళ్లాడని ఆయన అన్నారు. వివిధ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టి పారేశారు. జ్యోతి మల్హోత్రా కి నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. సన్నీ స్నేహితుడు చెన్నైలో ఉండడం వల్ల ఆయన వద్ద సన్నీ లగేజ్ ఉండడంతో తన లగేజ్ తెచ్చుకోవడం కోసం సన్నీ చెన్నై వెళ్లాడని చెన్నైలో ఓ ఇంట్లో ఉన్న సన్నీని కొంతమంది వచ్చి తీసుకెళ్లారని వాళ్ళు ఎవరనేది మాకు క్లారిటీ రాలేదని ఆయన తెలిపారు.
మీడియాలో ఎన్ఐఏ వాళ్లు అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వస్తున్నాయన్నారు. ఒకవేళ ఎన్ ఐ ఏ వాళ్లు అరెస్ట్ చేసిన నా కొడుకు నిర్దోషిగా బయటకి వస్తాడని ఆయన తెలిపారు. గతంలో బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వెంటనే నా కొడుకు వచ్చి స్టేషన్ లో హాజరయ్యారని తెలిపారు. పోలీసులు సూచన ప్రకారం నా కొడుకు నడుచుకున్నాడని ఆయన అన్నారు. ప్రస్తుతానికి సన్నీ యాదవ్ విషయంలో కోర్టుకు వెళ్లే ఆలోచన లేదని ఆయన తెలిపారు.






