- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలందించాలి : ఎమ్మెల్యే బాలు నాయక్
ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు.

దిశ, దేవరకొండ టౌన్ : ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను తిరిగి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. రోగుల పట్ల ఎలాంటి అలసత్వం వహించకుండా జాగ్రత్తలు పాటించాలని, ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి సిబ్బంది హాజరు పట్టీని కూడా పరిశీలించిన వైద్యులు, ఇతర సిబ్బంది సమయపాలన పాటించడం ప్రాముఖ్యతను చెప్పారు. రోగులకు అందించే ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించి, భోజనాన్ని రుచి చూశారు. వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్యనాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






