- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బానోతు సురేష్ నాయక్ నియామకం
తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బానోతు సురేష్ నాయక్ నియామకం అయ్యారు.

దిశ, చివ్వెంల : తెలంగాణ గిరిజన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బానోతు సురేష్ నాయక్ నియామకం అయ్యారు. సూర్యాపేటలో లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు దారావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ గిరిజన ఉపసర్పంచ్ ల సంఘం యూనియన్ సభ్యులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సూర్యాపేట పట్టణానికి వచ్చిన నూతనంగా ఎన్నికైన గిరిజన ఉపసర్పంచులు తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బానోతు సురేష్ నాయక్ ను ఏన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన అధ్యక్షులు బానోతు సురేష్ నాయక్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన గిరిజన నాయకులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని పూర్తి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ వివిధ కమిటీలు త్వరలో నిర్వహిస్తామని నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కమిటీ ద్వారా ఉపసర్పంచులకు సర్పంచుల లాగానే గౌరవ వేతనం ఇవ్వాలని, గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించి ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం ఉప సర్పంచులు అనిల్ నాయక్, రవితేజ నాయక్, నాగేశ్వరావు నాయక్, విజయ నాయక్, మోహన్ నాయక్, రామ్ సింగ్ నాయక్, ఇస్లావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.






